నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందా రా.. హిజ్రాని చితకబాదిన ఆటో డ్రైవర్

by Indraja |
నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందా రా.. హిజ్రాని చితకబాదిన ఆటో డ్రైవర్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆదరించే వాళ్ళు లేక.. కష్టపడి పనిచేస్తామన్నా ఎవరు పని ఇవ్వని నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో హిజ్రాలు బిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారు. అయితే కొందరు మగవాళ్ళు సైతం హిజ్రాలుగా వేషం వేసుకుని దారిన వచ్చి పోయే వాళ్ళని బెదిరించి మరీ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. రోజు రోజుకి హిజ్రాల వేషంలో వచ్చే పోయే వాహనదారుల నుండి డబ్బులు దోచుకుంటున్న మాఫియా పెరిగిపోతుంది.

ముఖ్యంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో హిజ్రా వేషంలో వచ్చి పోయే వాహనదారుల నుండి డబ్బులు దోచుకునే మాఫియా ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో హిజ్రా వేషం వేసుకున్న ఓ వ్యక్తి నడిరోడ్డుపై డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆటోడ్రైవర్ ను బెదిరించారు. అయితే తనని డబ్బుల కోసం బెదిరిస్తోంది హిజ్రా కాదని..

హిజ్రా వేషంలో ఉన్న పురుషుడని గుర్తించిన ఆ ఆటో డ్రైవర్ హిజ్రావేషదారుడిపై దాడి చేశారు. ఇక అక్కడున్న స్థానికులు సైతం ఆటో డ్రైవర్ కి మద్దతురాగా హిజ్రావేషదారుడిని చితకబాదారు. అనంతరం ఆ హిజ్రావేషదారుడిని పోలీసులకు ఆటో డ్రైవర్ అప్పగించారు. కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story