ఒకేరోజు సీఎం KCR , Revanth Reddy.. మునుగోడులో హైటెన్షన్

by Disha Web Desk 4 |
ఒకేరోజు సీఎం KCR , Revanth Reddy.. మునుగోడులో హైటెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే పార్టీలు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలతో టచ్ లో ఉంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ సైతం తమ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతున్నాయి. అయితే రేపు ఒకే రోజు సీఎం కేసీఆర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు మునుగోడులో పర్యటించనుండటం హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభలో పాల్గొననున్నారు. మునుగోడు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం భారీగా జన సమీకరణకు టీఆర్ఎస్ నేతలు కృషి చేస్తున్నారు. మరో వైపు రేపు మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయత్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో 'మన మునుగోడు, మన కాంగ్రెస్' పోస్టర్ ను రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.

కరోనా నుండి కోలుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కానున్నారు. శనివారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో జయంతి వేడుకలను నిర్వహించేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నేతలు నివాళులు అర్పించనున్నారు. కాగా శనివారం కేసీఆర్, రేవంత్ రెడ్డి టూర్ తర్వాత ఆ మరుసటి రోజే ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం ఉత్కంఠ రేపుతోంది. దీంతో సభలకు, పాదయాత్రలకు జనసమీకరణపై పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం జన సమీకరణ ఓ ప్రామాణికంగా మారుతున్న నేపథ్యంలో రేపటి కేసీఆర్, రేవంత్ రెడ్డి పర్యటనలపై హైవోల్టేజ్ హైప్ క్రియేట్ అవుతోంది.


Next Story

Most Viewed