నేడు సెక్రటేరియట్‌లో హై లెవల్ కమిటీ మీటింగ్

by Disha Web |
నేడు సెక్రటేరియట్‌లో హై లెవల్ కమిటీ మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. వాణిజ్య, నివాస నిర్మాణాలను ఫైర్ సేప్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాటి నివారణపై బుధవారం సెక్రటేరియట్‌లో హైలెవల్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ వీఅండ్ఈ, పోలీసుశాఖతో పాటు పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క గ్రేటర్ లోనే 25వేలకు పైగా వాణిజ్య, నివాసం, సెల్లార్ల నిర్మానాలను చేపట్టినట్లు సమాచారం.

అంతేగాకుండా ఫైర్ సేప్టీ నిబంధనలు కూడా లేవని సర్వేలో వెళ్లడి అయింది. గ్రేటర్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతుండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వాటికి అడ్డుకట్టవేసేందుకు అక్రమనిర్మాణాల కూల్చివేతలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం వర్షాలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడే స్పందించి చేతులు దులుపుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం హైలెవల్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Also Read...

BRS కేడర్‌లో జోష్ పెంచే కేసీఆర్ వ్యూహం


Next Story