ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్.. మంత్రి పువ్వాడకు నోటీసులు

by GSrikanth |
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్.. మంత్రి పువ్వాడకు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని పలు హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఇస్కాన్, యాదవ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఉత్తర్వలు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని పువ్వాడ అజయ్ సహా నిర్వహాకులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. హైకోర్టు నిర్ణయంతో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా ఈ నెల 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

Next Story

Most Viewed