హైదరాబాద్‌‌‌లో దంచికొడుతున్న వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-09 11:25:33  IST  )

హైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. ఉద‌యం నుండి సూర్యుడు నిప్పులు కురిపించ‌గా 3గంట‌ల త‌ర‌వాత వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌ల్ల‌బ‌డింది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం దంచికొడుతోంది.

heavy rains in telangana for three days
X

heavy rains in telangana for three days 

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. ఉద‌యం నుండి సూర్యుడు నిప్పులు కురిపించ‌గా 3గంట‌ల త‌ర‌వాత వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌ల్ల‌బ‌డింది. ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం దంచికొడుతోంది. నాచారం, మ‌ల్లాపూర్, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, ఓయూ క్యాంప‌స్, న‌ల్ల‌కుంట‌, విద్యాన‌గ‌ర్, లాలాగూడ‌, లాలాపేట‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. సైబరాబాద్‌ పరిధిలోనూ కుండపోత వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఒక్క‌సారిగా మ‌బ్బులు క‌మ్ముకుని వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షం కార‌ణంగా కొన్ని ప్రాంతాల్లో క‌రెంట్ కూడా పోయింది.

అయితే ఉద‌యం నుండి ఉక్క‌పోత‌తో స‌త‌మ‌తమైన ప్ర‌జ‌లు వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టంతో ఊపిరిపీల్చుకున్నారు. మ‌రోగంట‌లో న‌గ‌రంలోని ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, మ‌ల్కాజ్ గిరి, మ‌లక్ పేట్, అంబ‌ర్ పేట్, రామంత‌పూర్, స‌రూర్ న‌గ‌ర్, సైదాబాద్, ముషీరాబాద్, హిమాయ‌త్ న‌గ‌ర్ ప్రాంతాల్లో కూడా వ‌ర్షం కురుస్తుంద‌ని వెద‌ర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో దాదాపు ఎండలకు ఇక గుడ్ బై చెప్పినట్టే కనిపిస్తోంది.

Next Story