భారీ వ‌ర్షం..హైదరాబాద్ మెట్రోలో పెరిగిన రద్దీ

by velandi.Saikiran |

భారీ వ‌ర్షం నేప‌థ్యంలో హైదరాబాద్ మెట్రోలో రద్దీ పెరిగింది.

భారీ వ‌ర్షం..హైదరాబాద్ మెట్రోలో పెరిగిన రద్దీ
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, షేక్ పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వ‌ర్షం ప‌డ్డ నేప‌థ్యంలో రోడ్లన్నీ జలమయ‌మై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలా మంది ఉద్యోగులు, ఇత‌ర ప్రయాణికులు మెట్రోలో ప్ర‌యాణించారు. ఈ క్ర‌మంలో మెట్రో స్టేష‌న్ల‌లో ర‌ద్దీ విప‌రీతంగా పెరిగింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

నేడు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడుతున్నట్లు హెచ్చరించింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.

Next Story