బీ అలర్ట్ : తెలంగాణకు 5 రోజుల పాటు భారీ వర్ష సూచన

by Disha Web Desk 5 |
బీ అలర్ట్ : తెలంగాణకు 5 రోజుల పాటు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : రోహిణి కార్తె ఎండలతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రాబోయే ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తర దక్షిణ ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిందని, దీంతో గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగందో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఖమ్మం, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి,మంచిర్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంట. ఇక ఈరోజు హైదరాబాతో సహా పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.


Next Story