బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

by Dishanational2 |
బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ తీవ్ర తుఫాన్ గా మారిందని IMD ప్రకటించింది. సైక్లోన్ ‘మోఖా’ శుక్రవారానికి అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నానికి కాక్స్ బజార్, క్యుక్ప్ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. ఇక సైక్లోన్ ‘మోఖా’ప్రభావంతో, తెలంగాణ, ఏపీకి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని, అందువలన రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రెండు రోజులుగా ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed