భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిద అయిన మూడు షాపులు

by Rajesh |
భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిద అయిన మూడు షాపులు
X

దిశ, మక్తల్ : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహావీర సర్కిల్‌లోని రంజిత్ డ్రెస్సెస్ వస్త్ర దుకాణం, సమీపంలోని గిగా బైట్ అనే ఎలక్ట్రిక్ షాప్, మోటారు బైక్ దుకాణాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. భవనం నుండి భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. భవనంలో పని చేస్తున్న శ్రీనివాస్ అనే కార్మికుడు ప్రాణభయంతో భవనంపై నుంచి దూకడంతో రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ వివరాలను ఫైర్, పోలీస్ సిబ్బంది తెలపాల్సి ఉంది.

వ్యాపార రీత్యా ఎప్పుడు రద్దీగా ఉండే మహావీరచౌక్ ప్రాంతాల్లో ఆకస్మిత్తుగా షాక్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లా ఎగసిపడుతున్న మంటలకు బట్టలషాపు ముందు బాగం పూర్తిగా కాలిపోగా.. మంటలు పక్కన ఉన్న మూడు ఎలక్ట్రిక్ వాహనాలు, రెండు బైక్‌లకు వ్యాపించడంతో అవి కాలి బూడిదైయ్యాయి. రెండంతస్తుల భవనంలో దట్టమైన పొగలు కమ్ముకొని మంటలు వ్యాపించడంతో ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ముందస్తుగా మహావీర సర్కిల్‌లో ఘటన సమీపంలోని దుకాణ యజమానులు భద్రత కోసం వారి దుకాణాలను మూసివేశారు. వాహనాల రాకపోకలను ట్రాఫిక్ సిబ్బంది నియంత్రించండంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Next Story