జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటకు కారణమైన HCA

by Disha Web Desk 12 |
జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటకు కారణమైన HCA
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు క్రికెట్ అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్ వద్ద చోటు చేసుకున్న ఉధ్రిక్తలకు ముమ్మటికి HCA వారి నిర్లక్షమే కారణం. ఎందుకంటే నిన్న హడావిడిగా క్రికెట్ బోర్డు ఇవాల్టి నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పిన అధికారులు అసలు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నయో క్లారిటీగా చెప్పలేదు.

కేవలం 3 వేల టికెట్ల కోసం దాదాపు 30 వేలకు పైగా క్రికెట్ అభిమానులు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దీంతో ఉదయం పోలీసులు అభిమానులను కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అభిమానులను చెదరగొట్టి కింద పడిపోయిన వారిని కాపాడారు. ఈ తొక్కిసలాటలో అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

Next Story