అసెంబ్లీలో హరీష్ రావు Vs మంత్రి కొండా సురేఖ

by Disha Web Desk 4 |
అసెంబ్లీలో హరీష్ రావు Vs మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా కొండా సురేఖ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారన్నారు. డబుల్ బెడ్ రూం నిరుపేదలకు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు సైతం వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారన్నారు. జగన్, కేసీఆర్ బయట తిట్టుకుంటారని.. లోపల మాత్రం కలిసే ఉంటారన్నారు. కష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని దూరం పెట్టిందే కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. వరంగల్ జైలు కూలగొట్టి ఏం చేశారన్నారు. పాత సెక్రటేరియట్ కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. అంతకు ముందు హరీష్ రావు కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరించలేదన్నారు.

Next Story

Most Viewed