ఐఏఎస్‌ హన్మంతరావుకు అదనపు బాధ్యతలు..

by Disha Web |
ఐఏఎస్‌ హన్మంతరావుకు అదనపు బాధ్యతలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యానశాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ఎం.హనుమంతరావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌‌గా కొనసాగుతున్న ఆయనకు అదనంగా ఉద్యానశాఖ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాంపల్లిలోని ఉద్యానశాఖ కార్యాలయంలో డైరెక్టర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. హార్టీకల్చర్‌ కమిషనర్‌ వెంకట్రాంరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన ఈ బాధ్యతలను హనుమంతరావుకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణలో హార్టీకల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ కీలకం. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారికి ఉద్యానశాఖ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed