- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి బ్రేక్.. స్టేటస్ కో విధించిన తెలంగాణ హైకోర్టు
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో సంచలన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణానికి అనూహ్యంగా బ్రేక్ పడింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ భవన నిర్మాణం చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టులో మొత్తం ఐదు రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆయా రిట్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ల వాదనలు విన్న అనంతరం, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణంపై ‘స్టేటస్ కో’ ఆదేశించింది. అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడ ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. విచారణ వాయిదా
అయితే, ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, కేసు తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది. సీఎం శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే కోర్టు స్టేటస్ కో విధించడంతో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ భవన నిర్మాణంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






