- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Mahila Congress: గాంధీభవన్‌లో ఘనంగా మహిళ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో: మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ప్రారంభించారు. మహిళ కాంగ్రెస్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సునీత రావు సహా మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత రావు మాట్లాడుతూ.. ఏఐసీసీ మహిళ కాంగ్రెస్ ఆదేశాల మేరకు దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 40 ఏళ్ల క్రితం మహిళ కాంగ్రెస్ ను ప్రారంభించారని తెలిపారు.
ఇందిరా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం పలువురు మహిళలకు సభ్యత్వ నమోదు చేశారు. మహిళ సాధికారత, మహిళ చైతన్యం, ఆర్థిక ప్రోత్సాహకాలు, రాజకీయాలలో ఉన్నత పదవులు మహిళలకు ఇచ్చి గౌరవించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. సభ్యత్వ నమోదు కోసం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ వెబ్ సైట్ ప్రారంభించామని, ఇందులో వంద రూపాయల రుసుము చెల్లించి మహిళ కాంగ్రెస్ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు.