- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
G. Kishan Reddy : కాంగ్రెస్ రాజకార్ల వారసత్వ పార్టీ
దిశ, మేడ్చల్ బ్యూరో : రాజకార్ల వారసత్వ పార్టీ కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచనం లభించిన రోజుగా సెప్టెంబర్ 17ను అభివర్ణించారు.కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ‘హైదరాబాద్ విమోచన ’వేడుకల్లో జి.కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి, భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.అంతకు ముందు అమర జవాన్ల స్తూపానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేసినట్లు తెలిపారు.
ప్రజల బలిదానాలు, త్యాగాల తర్వాత తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్,మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ లు పాల్గొన్నారు. భద్రత బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.