రెండేళ్ల గ్యాప్ తర్వాత అసెంబ్లీకి గవర్నర్.. స్పీచ్‌పై ఉత్కంఠ!

by Disha Web Desk 2 |
రెండేళ్ల గ్యాప్ తర్వాత అసెంబ్లీకి గవర్నర్.. స్పీచ్‌పై ఉత్కంఠ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుమారు రెండు సంవత్సరాలు తర్వాత గవర్నర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 3వ తేదీన గవర్నర్ స్పీచ్‌లో ఏయే అంశాలుంటాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. కేవలం ప్రభుత్వ విధానాలు, పథకాలు గురించి మాత్రమే ఉంటాయా? లేక రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయా? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కేంద్రం తీరును విమర్శించే తీరుగా ప్రసంగం కాఫీ ఉంటే గవర్నర్ చదువుతారా? లేదా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మొన్నటి వరకు ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య కొనసాగిన వివాదానికి ప్రస్తుతం బ్రేక్ పడినట్టయింది. ఇక ప్రస్తుతం గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం సీరియస్‌గా కసరత్తు చేస్తున్నది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సీఎంఓ అధికారులు స్పీచ్ కాఫీని తయారు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల దృష్టితో స్పీచ్ తయారీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం చేసిన పనులు, పథకాలపై ప్రధాన ఫోకస్ ఉంటుందని సమాచారం. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వట్లేదని పదే పదే సీఎంతో పాటు మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయకుండా గవర్నర్ ప్రసంగం కాపీ తయారు చేస్తే.. ఇంతకాలం కేంద్రంపై చేసిన విమర్శలపై వెనక్కి తగ్గినట్టు అవుతుందా?అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సమాచారం. ఈసారి గవర్నర్ ప్రసంగంలో కేంద్రంపై రాజకీయ విమర్శలు ఉంటే గవర్నర్ ఆ ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదువుతారా? లేక విమర్శలను పక్కకు పెట్టి మిగతా అంశాలను మాత్రమే చదువుతారా?అనే అసక్తి నెలకొంది. ఈ మధ్య తమిళినాడు అసెంబ్లీలో ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని కాకుండా అక్కడి గవర్నర్ తన సొంత ప్రసంగాన్ని చదివారు. ఆ ప్రసంగం రికార్డులోకి వెళ్లకుండా అక్కడి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.

Also Read...

TS: అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు.. నేడు రెండు శాఖలతో భేటీ!Read Disha E-paper

Next Story