ప్రైవేటు వర్శిటీల బిల్లుపై గవర్నర్ అసహనం.. మరోసారి రాజ్ భవన్‌కు మంత్రి సబిత?

by Disha Web Desk 2 |
ప్రైవేటు వర్శిటీల బిల్లుపై గవర్నర్ అసహనం.. మరోసారి రాజ్ భవన్‌కు మంత్రి సబిత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుపై గవర్నర్ తమిళి సై అసహనంగా ఉన్నట్టు తెలిసింది. తమకు ఇష్టమైన వారికి, ఎడుకేషన్ లో ఎలాంటి అనుభవం లేని సంస్థలకు యూనివర్సిటీలను కట్టబెట్టారని గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అందుకే కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలుపలేదని సమాచారం. సెప్టెంబరులో కొత్తగా 6 యూనివర్సిటీలకు అనుమతి ఇస్తూ అసెంబ్లీ చట్ట సవరణ చేసింది. అందులో నిక్ మార్,అమిటి,సీఐఐ,గురునానక్,కావేరీ,ఎంఎన్ఆర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ బిల్లును అసెంబ్లీ అమోదించినా ఇంతవరకు గవర్నర్ ఆమోదం పడలేదు. టీచింగ్ అనుభవం లేని కావేరీ సీడ్ సంస్థకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇస్తారని గవర్నర్ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది.

టీచింగ్ అనుభవం లేకుండా వర్సిటీ ఏర్పాటు చేయొచ్చా?

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రైవేటు వర్సిటీల అన్నిట్టికి గతంలో టీచింగ్ అనుభవం ఉంది. చాలా కాలంగా ఆ సంస్థలు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలను నడిపిస్తున్నాయి. కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసం దరఖాస్తు చేసుకున్న కావేరీ సీడ్ సంస్థకు టీచింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. రైతుల సహకారంతో సీడ్ కల్టివేషన్, మార్కెంటింగ్‌లో మాత్రమే అనుభవం ఉంది. ఇలాంటి సంస్థకు అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుమతి ఎలా ఇచ్చారని రాజ్ భవన్ వర్గాలు అనుమానంగా ఉన్నట్టు తెలిసింది. గతంలో ఎదైన టీచింగ్ కాలేజీతో కలసి పనిచేసిన అనుభవం ఉందా అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం.

మరోసారి సబితాను పిలవనున్న రాజ్ భవన్?

ప్రైవేటు వర్సిటీల బిల్లులో ఉన్న అనుమానాలపై రాజ్ భవన్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితాకు మరోసారి పిలుపు రావచ్చని టాక్ ఉంది. కావేరి అగ్రికల్చర్ వర్సిటీకి ఎలా అనుమతి ఇచ్చారు? వర్సిటీ ఏర్పాటుకు ఎలాంటి అనుభవం ఉండాలి? ఎన్ని సంవత్సరాలుగా టీచింగ్ చేస్తూ ఉండాలి?కావేరి సంస్థకు గతంలో టీచింగ్ చేసిన అనుభవం ఉందా? ఈ అంశాలపై గవర్నర్ వివరణ తీసుకునే చాన్స్ ఉంది.

మిగతా బిల్లులను పట్టించుకోని సర్కారు

వర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ సంతకం చేయకపోవడంతో పెద్ద హంగామా జరిగింది. రాజ్ భవన్ ముందు నిరుద్యోగులతో అందోళనకు ప్లాన్ చేసింది. మోడీ టూర్ ను అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ ప్రకటించింది. కాని ఇప్పటికి ప్రైవేటు వర్సిటీల బిల్లుతో పాటు ఫారెస్ట్రీ యూనివర్సిటీ బిల్లు,అజామాబాద్ ఇండస్ర్టియల్ ఎస్టేట్ అధికారాల సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయి మెంట్ సవరణ బిల్లు, మోటర్ వెహికల్ చట్ట సవరణ బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టలేదు. వీటిపై అటు ప్రభుత్వం నుంచి ఇటు రాజ్ భవన్ నుంచి ఎలాంటి కదలిక లేదు.

ఇవి కూడా చదవండి : తెలంగాణ వైద్యరంగంలో నూతన విప్లవం.. ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్న కేసీఆర్!


Next Story