తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్.. రైతు భరోసాపై ప్రత్యేక చర్చ

by Anjali |
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్.. రైతు భరోసాపై ప్రత్యేక చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వారం లేదా, పది రోజులు నిర్వహించే యోచనలో ఉంది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో రైతు భరోసాపై ప్రత్యేక చర్చ జరగనుందని సమాచారం. ఎన్నికల సందర్బంగా 15 వేల రైతు భరోసా ఇస్తాం అని హామీ కాంగ్రెస్ రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిన విధంగా కాకుండా, రైతు భరోసాలో మార్పులు చేయాలని 5 ఎకరాల వరకే సీలింగ్ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. రైతు భరోసా గురించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. పలువురు రైతులు కూడా రైతు భరోసా ఇంకెప్పుడు పడేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల అనంతరం రైతు భరోసాపై.. ఇందులో జరిగే మార్పులపై క్లారిటీ వస్తుంది.



Next Story

Most Viewed