తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు.. యూపీఏ: చీఫ్ విప్ భానుప్రసాద్ ఫైర్

by Satheesh |
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు.. యూపీఏ: చీఫ్ విప్ భానుప్రసాద్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతల మాటలు తెలంగాణ సమాజం నమ్మదని ప్రభుత్వ చీఫ్ విప్ భానుప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని.. ఆనాటి యూపీఏ భాగస్వామ్య ప్రభుత్వమన్నారు. యూపీఏలో భాగస్వామ్యం అయ్యిన అన్ని పార్టీలను కేసీఆర్ ఒప్పించారని అన్నారు. తుక్కుగూడలో నిర్వహించన సభతో కాంగ్రెస్ సింపతీ పొందే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న రాహుల్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇచ్చిందో రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తి కాస్త అవగాహనతో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ అనౌన్స్ చేసిన స్కీమ్‌లన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నయన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. తెలంగాణ మీద మరోసారి ప్రధాని మోడీ విషం కక్కారని.. రాష్ట్ర విభజన మీద మోడీ వ్యాఖ్యలకు ఇక్కడి బీజేపీ నేతలు ఏం చెప్తారని ప్రశ్నించారు.



Next Story

Most Viewed