విద్యార్ధులకు గుడ్ న్యూస్.. గవర్నమెంట్ స్కూళ్లలో త్వరలోనే సెమీ రెసిడెన్సియల్ విధానం!

by Ramesh Goud |
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. గవర్నమెంట్ స్కూళ్లలో త్వరలోనే సెమీ రెసిడెన్సియల్ విధానం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్సియల్ విధానాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి కోడి ముందా గుడ్డు ముందా అన్న విధంగా మారిపోయిందని, సింగిల్ టీచర్ స్కూళ్లను తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి రాణించిన విద్యార్ధులకు సన్మానం చేసేందుకు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హజరైన ఆయన విద్యార్ధులకు చక్కని శుభవార్త చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మా ప్రభుత్వం రాగానే బుర్రా వెంకటేశం గారిని సెక్రటరీగా నియమించి నిర్విర్యమైన ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని ఆదేశించాం. టీచర్లు లేరని విద్యార్ధులు రావడం లేదు.. విద్యార్ధులు లేరని ప్రభుత్వం పాఠశాలలు మూసివేస్తుందని, ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు అయ్యింది అన్నారు.

కొన్ని చోట్ల సింగిల్ టీచర్ స్కూల్స్ ని ప్రభుత్వం మూసివేస్తే.. మరి కొన్ని చోట్ల స్కూళ్లలో విద్యార్ధులు తక్కువ టీచర్లు ఎక్కువ ఉంటున్నారని తెలిపారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. సింగిల్ టీచర్ పాఠశాలలు మూసివేయవద్దని, తండాలు, గూడెంలలో మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లను నిర్వహించడం ద్వారా పేదలకు దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకు రావచ్చని, వారి తల్లిదండ్రులకు ఆర్ధిక బారాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ఒక్కో విద్యార్ధిపై 80 వేల రూపాయల ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వ అధికారి చెప్పారని, ఇదంతా ఉద్యోగుల జీతాల మీదనే పోతుందని తెలిపారు.

మారుమూల ప్రాంతాలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం రాగానే 11 వేల పై చిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీని వేసిందని అన్నారు. అలాగే శిధిలావస్తలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మించాలని 2 వేల కోట్ల తో పనులు ప్రారంభించామని తెలిపారు. సెమీ రెసిడెన్సియల్ విధానాన్ని తీసుకురావాలని వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు మాదవరావు సలహా ఇచ్చారని, సెమీ రెసిడెన్సియల్ అంటే టిఫిన్, మద్యాహ్న బోజనంతో పాటు స్నాక్స్ కూడా ఏర్పాటు చేసే విధానం అని, ఈ సూచనను మా ప్రభుత్వం తీసుకుంటుందని, దీనికై ఆలోచన చేసి త్వరలోనే అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే రెసిడెన్సియల్ స్కూల్స్ వల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కుటుంబ బందాలు బలహీనపడుతున్నాయని రిపోర్టు వచ్చిందని, ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారే అవకాశం ఉందని అన్నారు. అందుకే తల్లిదండ్రులకు పిల్లలను దూరం చెయ్యకుండా గ్రామాలలో పాఠశాలలను నిర్లక్ష్యం చేయ్యోద్దని సూచించారు.

Next Story

Most Viewed