విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. జులై - ఆగస్టులో కూడా..!

by Anjali |
విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. జులై - ఆగస్టులో కూడా..!
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రతి ఏటా రెండు సార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించాలని యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ వెల్లడించారు. 2024-2025 విద్యా సంవత్సరం నుంచి రెండు అడ్మిషన్ సైకిల్స్.. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇలా సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్లు అందించగలిగితే.. బోర్డు ఫలితాల్లో ఆలస్యం తదితర సమస్యలు ఉండవని తెలిపారు. అలాగే పలు కారణాల వల్ల జులై-ఆగస్టులో అడ్మిషన్ తీసుకోలేనివారు జనవరి-ఫిబ్రవరిలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. కంపెనీలు కూడా రెండు సార్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించడం వల్ల పట్టభద్రులకు ఆద్యోగ అవకాశాలు పెరుగుతాయని UGC చీఫ్ జగదీష్ కుమార్ వెల్లడించారు.

Next Story