గొర్రెల పెంపకదారులకు గుడ్ న్యూస్​

by Disha Web Desk 19 |
గొర్రెల పెంపకదారులకు గుడ్ న్యూస్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: గొర్రెల పెంపక దారులకు సర్కార్ గుడ్​న్యూస్​తెలిపింది. గడ్డి విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నది. సొంత భూముల్లో పశుగ్రాసం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు.

ఇప్పటి వరకు 7.31 లక్షల మంది గొర్రెల పెంపకదారులను అర్హులుగా గుర్తించామని, మొదటి విడతలో 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి 2 వ విడతలో పంపిణీ చేస్తామన్నారు. గొర్రెల రవాణాకు జీపీఎస్​ సౌకర్యం తో కూడిన వాహనాలను ఉపయోగిస్తామన్నారు. రాష్ట్రంలో పెరిగిన గొర్రెల సంపదకు అనుగుణంగా దాణా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed