రేషన్ దారులకు గుడ్‌న్యూస్.. సన్నబియ్యం, క్వింటాకు రూ. 500 బోనస్‌పై టైమ్ ఫిక్స్

by Anjali |
రేషన్ దారులకు గుడ్‌న్యూస్.. సన్నబియ్యం, క్వింటాకు రూ. 500 బోనస్‌పై టైమ్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగు హూజూర్ పట్టణంలో రామ స్వామి గుట్ట వద్ద నిర్మించిన హౌసింగ్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన 2, 164 సింగిల్ బెడ్ రూం ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఉత్తమ్ ఆరోపించారు. తప్పకుండా ఈ సంవత్సరం డిసెంబరు నాటికి సింగిల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేసి అర్హులైన లబ్దిదారులందరికీ పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రాచారంలో కూడా ఉత్తమ్ కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed