- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యంత కీలకమైన సర్క్యులర్‌ను జారీ చేసింది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేర్వేరు తేదీల్లో జీతాలు రావడం వల్ల సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఈ నిర్ణయంతో చెక్ పడనుంది.
ఆలస్యమైతే HOD, DDOలదే బాధ్యత
జీతాల చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ శాఖలోనైనా 1వ తేదీన జీతాలు పడటంలో ఆలస్యమైతే అందుకు ఆయా శాఖల అధిపతులు (HOD), డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (DDO)దే పూర్తి బాధ్యత అని సర్క్యులర్‌లో కరాఖండిగా పేర్కొన్నారు. సకాలంలో బిల్లులు రికార్డు చేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీనే జీతాలు అందేలా చూసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, ప్రతి నెలా జీతాల ప్రక్రియను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు.






