పాలిసెట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

by Disha Web Desk 6 |
పాలిసెట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాలిటెక్నిక్, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ అగ్రిక‌ల్చర్‌ యూనివ‌ర్సిటీ, పీవీ న‌ర్సింహారావు తెలంగాణ యూనివ‌ర్సిటీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సులు, అగ్రిక‌ల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాల‌జీ, ఆర్గానిక్ అగ్రిక‌ల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడులయయ్యాయి. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్‌ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు.

ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. మొత్తం పాస్ పర్సంటేజీ 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 17న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,656 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 58,468 మంది అబ్బాయిలు, 47,188 మంది అమ్మాయిలు ఉన్నారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది.



Next Story

Most Viewed