నీతి ఆయోగ్ మీటింగ్‌కు సీఎం వెళ్ళాలి : సీఎం‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Dishanational2 |
నీతి ఆయోగ్ మీటింగ్‌కు సీఎం వెళ్ళాలి : సీఎం‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు. సీఎం కు శుక్రవారం లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉంటున్నారని తెలిసిందని, ప్రజాస్వామ్యంలో భావ సారూప్యం కలిగిన రాజకీయ పార్టీలు ఉంటాయన్నారు. అయినప్పటికీ పరిపాలన విషయంలో అన్ని పార్టీలు రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తాయన్నారు. దేశంలో రాష్ట్రాలకు తమ పరిధిలోని విషయాలపై పూర్తి అధికారం ఉన్నా అవి స్వతంత్రంగా వ్యవహరించలేవన్నారు. చాలా విషయాల్లో రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి పనిచేస్తాయన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల సమన్వయంతో దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఫెడరల్ స్పూర్తితో రాష్ట్రాల అభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధితో దేశాల అభివృద్ధి అని ముందుకు సాగడం, అట్టడుగున ఉన్న వారి అభివృద్ధికే ప్రత్యేక ప్రణాళికలు, గ్రామస్థాయి నుంచి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి కొన్నేళ్లుగా కేసీఆర్ సమావేశాలకు హాజరుకాకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్నారు. కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపితే చర్చించి పరిష్కరించేందుకు నీతి ఆయోగ్ వేదికగా అని, ఆ సమావేశాలను బహిష్కరిస్తే రాష్ట్ర ప్రజలకు మంచిదికాదని, బేషజాలకు పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెట్టొద్దని కోరారు.


Next Story

Most Viewed