రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు: వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారు: వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లాలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులపై ప్రజల్లో గౌరవం తగ్గుతోందని అన్నారు. చట్ట సభలు యుద్ధ సభలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొందరు కులాలు, మతాల పేరుతో వేరు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుత రాజకీయాలు తప్పుదోవ పడుతున్నాయని.. రాజకీయాలంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. మాతృభాషలోనే ప్రాధమిక విద్యా మొదలు పెట్టాలని అభిప్రాయపడిన ఆయన.. ఇంగ్లీష్ భాష నేర్చుకోండి.. కానీ ఇంగ్లీష్ సంస్కృతి కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎడ్యుకేషన్ అంటే ఒక మిషన్ అని.. అది కమీషన్ కాకుడదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కలెక్టర్లు తెలుగులోనే మాట్లాడాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed