'మంత్రి మల్లారెడ్డికి తొడలు కొట్టడం మాత్రమే వచ్చు'

by Disha Web Desk 2 |
మంత్రి మల్లారెడ్డికి తొడలు కొట్టడం మాత్రమే వచ్చు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల మీద చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు పెంచడంలేదు కానీ, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు మాత్రం పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వాడలను అమ్మి కేసీఆర్, కేటీఆర్ డబ్బులు దండుకోవచ్చని చూస్తున్నారని మండిపడ్డారు. కార్మికశాఖ మంత్రికి చట్టం తెలియదు కానీ, తొడలు కొట్టడం మాత్రమే తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు. కరోనా సమయంలో కార్మికుల వేతనల నుంచి పెద్ద మొత్తంలో డైవర్ట్ చేశారని అన్నారు.

కాంగ్రెస్ హయాంలో పెంచిన వెతనలే తప్ప 8 ఏళ్ల నుంచి పెంచడం లేదని, ప్రమాదాలు జరిగి చనిపోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కార్మికుల వేతనాలు పెరుగుతాయని, సకల జనుల సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడిని పర్మినెంట్ చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చారు కానీ, ఏ ఒక్కటి తీర్చడంలేదని అన్నారు. పెన్షన్, రైతు బంధు, దళిత బంధు ఇవే ప్రచారం చేసుకుంటున్నారు.. తప్ప కార్మికుల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని వారిని పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, వెంటనే ఆదుకోకపోతే పెద్దఎత్తున నిరసనలు చేసి అవసరమైతే ప్రగతిభవన్ ముట్టడి చేస్తాం అని రాములు హెచ్చరించారు.


Next Story