ఖమ్మం సభకు లేని నిబంధనలు.. 'రిపబ్లిక్ డే' కే కొవిడ్ రూల్స్ గుర్తొచ్చాయా?

by Disha Web |
ఖమ్మం సభకు లేని నిబంధనలు.. రిపబ్లిక్ డే కే కొవిడ్ రూల్స్ గుర్తొచ్చాయా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత గణతంత్ర వేడుకలను నాలుగు గోడల మధ్య నిర్వహించాలనుకోవడం కేసీఆర్ సిగ్గుమాలిన చర్యకు నిదర్శనమని, సీఎం ఖమ్మం సభకు లేని కొవిడ్ నిబంధనలు రిపబ్లిక్ డేకు గుర్తొచ్చాయా అని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సైనికులను, పోలీసులను, విద్యార్థులను అవమానించడమేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టులు మెట్టికాయ వేస్తే కానీ, కేసీఆర్ వినే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రుల సభలకు అడ్డురాని కొవిడ్ రూల్స్ గణతంత్ర వేడుకలకే వచ్చాయా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించడం సిగ్గు చేటన్నారు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప కేసీఆర్ వినే పరిస్థితి లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.


Next Story