మునుగోడు బైపోల్ సమీపిస్తోన్న వేళ.. Congress లోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు?

by Disha Web Desk |
మునుగోడు బైపోల్ సమీపిస్తోన్న వేళ.. Congress లోకి మాజీ ఎమ్మెల్యే దంపతులు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని అన్ని పార్టీలు చేరికలపై ఫోకస్ పెట్టాయి. అసంతృప్తులు, ఆశావాహులపై నజర్ వేస్తూ తమ పార్టీలోకి ఆహ్వానాలు అందిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. టీడీపీని వీడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి దంపతులు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఈ దంపతులు తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నామని గురువారం ప్రకటించారు. దయాకర్ రెడ్డి 1994, 1999 లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొంతారు. దయాకర్ రెడ్డి సతీమణి సీతా దయాకర్ రెడ్డి 2002లో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టి రికార్డు నెలకొల్పారు.

కొంత కాలంగా సైలెన్స్:

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్తకోట దంపతులు గత కొంతకాలం నుండి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదట్లో టీడీపీలో యాక్టివ్‌గా కొనసాగినా ఆ తర్వాత దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాజకీయంగా తిరిగి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి నేపథ్యంలో దయాకర్ రెడ్డి దేవరకద్రలో జరిగిన తన పుట్టిన రోజు వేడుకల్లో టీపీడీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీతో తనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

కాంగ్రెస్సా లేక బీజేపీనా?:

టీడీపీని వీడుతానన్న కొత్తకోట దంపతులు ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రజాభీష్టం మేరకు ఏ పార్టీలో చేరుతామనే విషయం చెప్తామన్నారు. ఏ పార్టీలో చేరబోయేది 3 నెలల తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామన్నారు. కాగా టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే వీరు కాంగ్రెస్‌లో చేరుతారా? లేక బీజేపీ లేదా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తిగా మారింది.

చంద్రబాబు ప్రయత్నానికి గండి?:

రాష్ట్ర విభజనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. చాలా రోజుల తర్వాత ఇటీవల గోదావరి వరద ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు ఆయన తెలంగాణలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనతో చంద్రబాబు తిరిగి తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరిగింది. తెలంగాణలో పార్టీకి క్యాడర్ ఉంటడంతో మునుగోడు ఉప ఎన్నికతోనే పార్టీకి తిరిగి పూర్వవైభం తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇంతలోనే పార్టీకి చెందిన సీనియర్ నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెలంగాణలో నామమాత్రంగా ఉన్న టీడీపీకి.. మిగిలిన కొద్దిమంది దూరం అయితే ఎలా అనే చర్చ తెరపైకి వస్తోంది. కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతుల నిర్ణయంతో తెలంగాణలో టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయాలనుకుంటున్న చంద్రబాబు ప్రయత్నానికి గండి పండినట్లవుతుందనే చర్చ జరుగుతోంది.



Next Story

Most Viewed