పల్లా రాజేశ్వర్‌రెడ్డి దొంగ దెబ్బ తీశారు: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

by Disha Web Desk 16 |
పల్లా రాజేశ్వర్‌రెడ్డి దొంగ దెబ్బ తీశారు: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జనగామలో పోలింగ్‌కు నెల రోజుల ముందు తన ఇంటి దగ్గర ఇంటిని అద్దెకు తీసుకుని ఫోన్ ట్యాప్ చేసి దొంగ దెబ్బ తీశాడని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన సన్నిహితుల ఇళ్ళలో సోదాలు చేసి రకరకాలుగా వేధింపులకు గురి చేశారని ఆయన వెల్లడించారు. తమ పార్టీలో చాలా మంది అభ్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని, బాధితులందరం కలిసి కలసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక చెల్లదని, దాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే పిటిషన్ వేసినట్లు కొమ్మూరి తెలిపారు.


Next Story

Most Viewed