Jeevan Reddy: హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపేయండి

by Gantepaka Srikanth |
Jeevan Reddy: హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రాను రద్దు చేసి, కూల్చడాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇందిరా గాంధీ గరీబ్ హఠావో అనే నినాదం ఉండేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గరీబోంకో అటావో అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అంటేనే స్కానింగ్ కూల్చడం.. కాల్చడం.. కన్స్ట్రక్షన్స్.. డిస్రక్షన్స్ ఉంటున్నాయని మండిపడ్డారు. హైడ్రా పేరుతో హైడ్రా డ్రైవేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి పంచభూతాలను దోచుకుంటున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని, భూ కుంభకోణాలు.. ఆకాశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాదులోని పేదల ఉసురు పోసుకుంటున్నారన్నారు.

హైడ్రాను రద్దు చేయకపోయినా, రైతు రుణమాఫీ చేయకపోతే రైతులే కాంగ్రెస్ నేతలను తరిమి కొడతారని హెచ్చరించారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం మూసీ సుందరీకరణ అని, దానికి కేటాయించిన లక్షా యాభై వేల కోట్లే అన్నారు. రైతులకు 30 వేల మందికి రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.2500, పెన్షన్లు రూ.4000 ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అన్ని కులాల వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యతను సీఎం తీసుకోవాలన్నారు. 420 హామీలు ఇచ్చి ప్రజలకు ఏమి చేయకుండానే హైడ్రా పేరుతో మోసాలు చేస్తున్నారని వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలే పాతాళంలోకి తొక్కేస్తారని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed