బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు: బిగ్ బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి

by Satheesh |
బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి ఐదుగురు ఎమ్మెల్యేలు: బిగ్ బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేడి ముగిసిన అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాటల తుటాలతో తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు వర్షం కురిపిస్తుండగా.. హస్తం పార్టీ నేతలు సైతం అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడంతో స్టేట్ పాలిటిక్స్‌లో ఇంకా ఎన్నికల వేడి తగ్గినట్లు అనిపించడం లేదు. ఇదిలా ఉండగానే రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ అంటుండంగా.. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఐదేళ్లు ఎలాంటి ఢోకా లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు అని జగ్గారెడ్డి సెటైర్ వేశారు. కానీ తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని తేల్చి చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారన్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుండి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని కేటీఆర్, హరీష్ రావు సీఎంపై బురదజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులని అన్నారు. కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపైన జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏనాడు హత్యా రాజకీయాలు జరగలేదని అన్నారు.

Next Story