మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాత్మక అడుగులు.. మున్సిపాలిటీ కైవసంపై ఫోకస్

by Disha Web Desk 2 |
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాత్మక అడుగులు.. మున్సిపాలిటీ కైవసంపై ఫోకస్
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సభ్యులు రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవిశ్వాసానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తన ఇలాకాలో మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎరుగవేసి సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు మంత్రాంగం నడుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. చైర్మన్ దింపేసి ఆ సీట్లో కాంగ్రెస్ కౌన్సిలర్ ను కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత చైర్మన్ ను దింపడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిర్లు రెడీ కావడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో నారాయణఖేడ్ మున్సిపాలిటీని అవిశ్వాసంతో కాంగ్రెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సంగారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన దృష్టి సారించింది.

మున్సిపాలిటీలో 38 వార్డులు..

సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులున్నార. ఇందులో ఓ కౌన్సిలర్ మరణించిన విషయం తెలిసిందే. దీనిత ప్రస్తుతం 37 మంది కౌన్సిలర్లు ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం విధితమే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మాణాలు పెడుతున్నారు. 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మీ శేఖర్, 22వ వార్డు కౌన్సిలర్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలైన జగ్గారెడ్డి సతీమణి నిర్మల, 23వ వార్డు కౌన్సిలర్ కూన వనితల ఆద్వర్యంలో అవిశ్వాసం పెట్టేందుకు చర్చలు జరిగాయి. చైర్మన్ ను దింపడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం రెడీ అంటున్నారు. బీఆర్ఎస్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ దింపేందుకు 13 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ వాళ్లు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మాణానికి బీఆర్ఎస్ 13 మంది, కాంగ్రెస్ 9 మంది, బీజేపీ, ఎంఐఎంలకు చెందిన ఇద్దరిద్దరు చొప్పున మద్దతు ప్రకటించారని, మొత్తం 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసినట్లు తెలిసింది.

అధికారంలో ఉన్నప్పుడే అవిశ్వాసం..

గత సంవత్సరం ఫిబ్రవరిలోనే మున్సిపల్ చైర్ పర్సన్ పై 22 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి కౌన్సిలర్లను బుజ్జగించడంతో అవిశ్వాస సమస్యను సద్దుమనిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామంటూ ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బహిరంగంగానే చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. గత పదేండ్లలో మున్సిపాలిటీ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనంతో తిట్లు పడ్డాం. చాలా నష్టపోయాం. కాంగ్రెస్ చైర్మన్ అయితేనైనా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నామని బీఆర్ఎస్ కు చెందిన ఓ కౌన్సిలర్లు చెప్పుకురావడం గమనార్హం. ఏడాది క్రితమే తప్పించాలనుకున్నామని, హరీష్ రావు చెప్పడంతో అప్పుడు ఆగిపోయామని గుర్తు చేశారు.

చైర్ పర్సన్ కుటుంబ సభ్యుల ఒట్టెద్దు పోకడలతోనే..

చైర్ పర్సన్ కుటుంబ సభ్యుల ఒట్టెద్దు పోకడలతోనే అటు కాంగ్రెస్, సొంత పార్టీ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నారు. ఇదే మున్సిపల్ పై సుదీర్ఘంగా ఎకచత్రాదిపత్యం చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు. మేమింతే...మా రూటే వేరు అనే స్థాయిలో చైర్ పర్సన్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో ఎక్కడ కూడా సరైన అభివృద్ధి జరగలేదని, ఈ క్రమంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రజల్లో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటున్నారు. ఇప్పటికే ఓ సారి సమావేశమైన కౌన్సిలర్లు మరోసారి తుది బేటీ తరువాత అవిశ్వాస తీర్మాణం పెట్టనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎక్కడ కూడా బయటపడకుండా వ్యూహాత్మంకగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతోనే చైర్ పర్సన్ కు చెక్ పెట్టిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.



Next Story

Most Viewed