- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగం
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురి అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను ఈ విధంగా అవమానిస్తారా.. అంబేద్కర్ విధానం అంటే ఇదేనా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. సభలో గంట సమయం ఇస్తే తనపై విమర్శలు చేస్తోన్న నేతలకు నా గురించి మొత్తం చెబుతానని.. మేం రాష్ట్రానికి, జిల్లాకు ఏం చేశామో చెబుతామన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలపై మాట్లాడినందుకే సభలో అధికార పార్టీ నేతలు నన్ను టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు.
కాగా, అంతకుముందు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెనకున్న అక్కల మాటలు వింటే కేటీఆర్ జూబ్లీ బస్టాండ్‌లో కూర్చొవాల్సి వస్తుందని పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు భావోద్వేగానికి గురి అయ్యారు.