కేసీఆర్‌ది పారాసిటమాల్ తెలివి: మాజీ మంత్రి

by Disha Web Desk 2 |
కేసీఆర్‌ది పారాసిటమాల్ తెలివి: మాజీ మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది పారాసిటమోల్ తెలివని, ఆయనే సైంటిస్ట్, ఆయనే డాక్టర్ అని ఫీల్ అవుతున్నట్లున్నారని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి రవీంద్ర నాయక్ విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతున్నట్లు సీఎం చెప్పారని, కాయితి లంబాడీలు అనే తెగ అసలు లేనే లేదన్నారు. మరి 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఈ తెగ ఎక్కడ దొరికిందోనని ఎద్దేవా చేశారు.

చల్లప్ప కమిషన్‌లో 9.08 శాతం ఎస్టీలు ఉంటే ఇతర కులాలను చేర్చి 10 శాతం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా ఎలా చేస్తారని నిలదీశారు. సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇస్తానన్న భూములు పోడు భూములు కావని, అన్యక్రాంతమైన భూములని వివరించారు. సీఎం అసలు పోడు భూముల సర్వే చెప్పట్టలేదని తేల్చిచెప్పారు. గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన బంధుకు నిధులు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. గిరిజన సహకార సంఘం నిధులు కూడా సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేశారని తెలిపారు. అసెంబ్లీలో గిరిజనులను వంచించి, కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. గిరిజనులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.



Next Story

Most Viewed