KTR : మీ చిట్టి నాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నాడా? మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు

by Ramesh N |
KTR : మీ చిట్టి నాయుడు ఇంకా టీడీపీలోనే ఉన్నాడా? మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు గొడవ పడితే కాంగ్రెస్‌పై నిందలు మోపడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులపై తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. ‘అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా లేక కాంగ్రెస్‌లో ఉన్నాడా ? సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం, మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవడు? సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ? అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అదేవిధంగా ఇదే‌ విషయంపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేస్తూ.. ‘మంత్రి శ్రీధర్‌బాబును సపోర్టింగ్ రోల్‌లో ఉత్తమ నటుడిగా నామినేట్ చేస్తున్నాను. భాస్కర్ అవార్డు కోసం.. దయచేసి అతని విజయాన్ని కాంక్షిస్తూ నాతో చేరండి’ అంటూ నెటిజన్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story