పార్టీ నేతలను హెచ్చరించిన కేసీఆర్..? పర్సనల్‌గా రేవంత్‌ను కలవొద్దని సూచన!

by Disha Web Desk 14 |
పార్టీ నేతలను హెచ్చరించిన కేసీఆర్..? పర్సనల్‌గా రేవంత్‌ను కలవొద్దని సూచన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ కనీసం లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ ఈ హడావుడిలో ఉండగా నేతలు కాంగ్రెస్ గూటికి క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్‌ను పార్టీని వదిలి కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని డైరెక్ట్ కలుస్తున్నారు. కానీ పార్టీ మారడం లేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అధిష్టానానికి చెప్పకుండా రేవంత్ రెడ్డితో కలవద్దని కేసీఆర్ పార్టీ శ్రేణులను హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయిన అధినేత సూచనలు కొందరు తుంగలో తొక్కి సీఎంను కలుస్తున్నట్లు సమాచారం. మరి రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీలు, లోకల్ స్థాయి కీలక నేతల నుంచి ముఖ్యనేతల వరకు కొందరూ కాంగ్రెస్‌లో చేరడం గులాబీ బాస్ వ్యూహంలో భాగమా? లేక నిజంగానే కేసఆర్‌కు షాక్ ఇచ్చారా? అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అసెంబ్లీలో పరాజయం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడం కోసం కోవర్టు ఆపరేషన్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేశారా? అనేది పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

బీఆర్ఎస్ టూ కాంగ్రెస్‌

ఇటీవల పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌లో అధినేత కేసీఆర్ అడుగపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిమాణం చోటుచేసుకోవడం గమనార్హం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన కేటీఆర్ ప్రధాన అనుచరుల్లో ఒకరైనా మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం సీఎంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు టాక్ నడుస్తొంది.

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నుంచి మొదలు

గతంలోనే సీనియర్ నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మన్నె జీవన్ రెడ్డితో ఆ జిల్లా నేతలు హస్తం గూటికి చేరారు. పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు మొదలైనాయి. ఈ క్రమంలోనే పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలన పోయి, కాంగ్రెస్ కార్పొరేటర్లు చైర్మన్లుగా విజయం సాధించారు. దీంతో లోకల్‌లో ఉండే కీలక నేతలు సైతం కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్‌లో అలజడి!

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అతని భార్య జడ్పీ చైర్‌పర్సన్ సునిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. వారు దాదాపు పార్టీలో చేరడం ఖరారు అయ్యిందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఒకే సారి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని తెలిపారు. మరోవైపు సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కలిశారు. సీఎంను కలిశాక ఆయన బీఆర్ఎస్ సమావేశానికి డుమ్మా కొట్టారు. కానీ నిధుల విషయంలో సీఎంను కలిశానని చెప్పుకొచ్చారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కలవడం బీఆర్ఎస్‌లో అలజడి మొదలైంది.

Next Story

Most Viewed