వాకర్ సాయంతో నడుస్తున్న మాజీ సీఎం కేసీఆర్

by Disha Web Desk 16 |
వాకర్ సాయంతో నడుస్తున్న మాజీ సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కాలు జారీ కిందపడ్డారు. దీంతో కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముకకు తీవ్ర గాయం అయింది. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమజిగూడ యశోద ఆస్పతికి తరలించారు. కొద్దిరోజులు పాటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తుంటి ఎముకకు సర్జరీ చేయించుకున్నారు. అనంతరం డిశ్చార్జి అయ్యారు. 8 వారాలు విశ్రాంతి తీసుకుంటే కేసీఆర్ కోలుకుంటారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ జూబ్లీహిల్స్ నంది‌నగర్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆయనను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కేసీఆర్ కూడా వాకర్ సాయంతో అటూ, ఇటూ నడుస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుని, రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed