దేశ చరిత్రలో తొలిసారి.. ఆర్మీ కీలక విభాగంలో ఐదుగురు మహిళలు

by Disha Web Desk 4 |
దేశ చరిత్రలో తొలిసారి.. ఆర్మీ కీలక విభాగంలో ఐదుగురు మహిళలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ చరిత్రలో తొలిసారిగా ఆర్టిలరీ రెజిమెంట్ లోకి ఐదుగురు మహిళా అధికారులకు ఇండియన్ ఆర్మీ ఎంపిక చేసింది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ కంప్లీట్ చేసిన మహిళా అధికారులు తాజాగా ఆర్టిలరీ రెజిమెంట్ లో చేరారు. ఈ రెజిమెంట్ లో చేరిన వారిలో లెఫ్టినెంట్ మెహక్ సైనీ, లెఫ్టినెంట్ సాక్షి దూబే, లెఫ్టినెంట్ అదితి యాదవ్, లెఫ్టినెంట్ పవిత్రా మౌద్గిల్ ఉన్నారు. ఐదుగురు మహిళా అధికారుల్లో ముగ్గురు చైనా సరిహద్దు, ఇద్దరు పాక్ సరిహద్దులోని అత్యంత సవాల్ తో కూడిన ప్రదేశాల్లో నియమించినట్లు ఆర్మీ అఫిషియల్స్ తెలిపారు.

Next Story

Most Viewed