బూడిద వార్.. రాజకీయ రగడ సృష్టిస్తున్న ఫ్లై యాష్

by Rajesh |
బూడిద వార్.. రాజకీయ రగడ సృష్టిస్తున్న ఫ్లై యాష్
X

దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బూడిద (ప్లై యాష్)రాజకీయ రగడ సృష్టిస్తుంది. ఎన్నికల ముందు బీజేపి నాయకురాలు రాణిరుద్రమ మీడియా సమావేశంలో బూడిద తరలింపులో మంత్రి పొన్నం హస్తం ఉందంటూ ఆరోపించగా మూడు రోజుల క్రీతం బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బూడిద లారీలను అడ్డుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపించడంతో విషయం మరింత రాజుకుని రాజకీయ రంగు పులుముకుంది.

బూడిద తరలింపులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటు అనుమతుల పేరిట పరిమితికి మించి తరలిస్తున్నారంటూ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం సృష్టించగా కాంగ్రెస్ నాయకులు సైతం ప్రత్యారోపణలు చేస్తు హెచ్చరించడంతో విషయం మరింత రాజుకుని రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుంది. అయితే బూడిదను ఖమ్మం జిల్లా లే నిర్మిస్తున్న వేషనల్ హైవే పనులకోసం తరలిస్తున్నట్టు అదికారులు చెబుతుండగా అనుమతుల పేరిట పరిమితికి మించి తరలించడం అందుకోసం సదరు కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధులకు కోట్ల రూపాయలు సమర్పించాడంటు ఆ డబ్బుల కోసం రాజకీయనేతలు రణం సృష్టిస్తున్నారంటు జనంలో చర్చ జోరందుకుంది.

రామగుండం నుండి ఖమ్మం సత్తుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ఫోర్ లైన్ రోడ్డుకు వెళ్తున్న ఫ్లై యాష్ కొందరు అధికారులకు ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తుంది. నిబంధనలు తుంగలో తొక్కి లారీ ట్రాన్స్ పోర్టర్లు పరిమితి నుంచి లోడింగ్‌తో ప్లైయాష్ రవాణా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరెవరికి ఎంతెంత ముట్ట చెప్పాలో అంత ముట్ట జెపుతూ అక్రమ రవాణాను సక్రమంగా కొనసాగిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు అక్రమంగా ఫ్లై యాష్ తరలిస్తున్న లారీల వైపు కన్నెత్తి చూడడం లేదు.

ఇటీవల కాలంలో ఫోర్ లైన్ రోడ్ల నిర్మాణంలో ఫ్లై యాష్‌ను సదురు కాంట్రాక్టర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే రామగుండం బూడిద చెరువులోని ఫ్లై యాష్ కాంట్రాక్టును దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లు ఫ్లై యాష్‌ను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. కాంట్రాక్టర్లు లారీ ట్రాన్స్ పోర్టర్‌లతో చేతులు కలిపి అప్పనంగా అందిన కాడికి దోచుకుంటున్నారు. అయితే అక్రమాలపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిత్యం వందల కొద్ది లారీలో అక్రమంగా ఫ్లైయాష్ రవాణా జరుగుతున్న అధికారులు ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రాన్స్‌పోర్టర్లే మాయగాళ్లు....

రామగుండం నుండి ఖమ్మం సత్తుపల్లికి రవాణా చేయడానికి కొందరు ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు కాంట్రాక్ట్ తీసుకున్నారు. కమిషన్ బేస్ మీద లారీలను తమ ట్రాన్స్ పోర్టులో పెట్టుకొని ఈ దందా నిర్వహిస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఎలాంటి బిల్లులు లేకుండా ఫ్లై యాష్ రవాణా జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా ఈ ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు మామూళ్లతో అధికారుల కళ్ళు మూయించారు. ఆ ప్రాంతంలో జనం అధికారులకు నెలనెలా మామూలు పంపుతున్నారంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ప్లై యాష్ రవాణా ప్రారంభమైన మొదట్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా వెళ్లే లారీల రవాణాను నిలిపివేశారు. అనంతరం రంగంలోకి దిగిన ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు అధికారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పడంతో ఫ్లై యాష్ రవాణా తిరిగి ప్రారంభమైనట్టు సమాచారం.

ఓవర్ లోడింగ్‌పై చర్యలు ఎక్కడ..

ప్లై యాష్ రవాణా చేస్తున్న లారీలు 70 నుండి 100 టన్నుల వరకు ప్లైయాష్ నింపుకొని వెళ్తున్న రవాణా శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రామగుండం నుండి ఖమ్మం వరకు ఉన్న ప్రతి జిల్లా రవాణా శాఖ అధికారులకు నెలనెలా పెద్ద ఎత్తున

ముడుపులందడంతో అటువైపు కన్నేత్తి చూడడం లేదని విమర్శలువెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందల కొద్ది లారీలు తమ కార్యాలయం పైగా వెళుతున్న అధికారులు మాత్రం ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

నేతల మధ్య ఫ్లై‌యాష్ వార్..

ఫ్లై యాష్ అక్రమ రవాణా పై అధికారులు నోరు మెదపకపోవడంతో గతంలో బిజేపి నాయకురాలు రాణి రుద్రమ అదికారపార్టి నేతలకు కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించగా ఇటీవల హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లారీలను ఆపి అక్రమ రవాణా గుట్టు విప్పారు. రవాణా శాఖ మంత్రి ప్లై యాష్ అక్రమ రవాణాలో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డాడని, ఇక అధికారుల అవినీతి దేవుడెరుగని ఘాటుగా విమర్శించారు. అధికారులతో పాటు కొందరి ప్రజాప్రతినిధులకు సైతం ఫ్లై యాష్ రవాణా కాసుల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.

అందుకోసమే నేతలు రాజకీయ విమర్శలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు అయితే అందుకు అదికారపార్టికి చెందిన కోంతమంది నేతలు ప్రతిపక్ష నేతలను ముందు పెట్టి ఆరోపణలు చేపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు

దొంగలను పట్టుకునేది ఎవరు....

ఫ్లై యాష్అక్రమ రవాణాలో అధికారులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు సైతం చేతులు కలపాయన్న విమర్శలు రావడంతో ఇక అక్రమాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్లు స్పందించి అక్రమార్కులపై కొరడా జులపించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed