ఫిబ్రవరి 14ను వీర జవాన్ల సంస్మరణ దినంగా జరపాలి: VHP

by Satheesh |
ఫిబ్రవరి 14ను వీర జవాన్ల సంస్మరణ దినంగా జరపాలి: VHP
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఫిబ్రవరి 14ను వాలంటైన్స్ డే గా జరుపుకోవద్దని బజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు అన్నారు. ప్రేమికుల దినం అంటూ క్లబ్బులు పబ్బుల్లో ఈవెంట్లు జరిపితే అడ్డుకుంటామని హెచ్చరించారు. అబిడ్స్ జీపీఓ చౌరస్తాలో మంగళవారం ఉదయం పుల్వామా దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీ‌ఎఫ్ జవాన్లకు బజరంగ్ దళ్, వీహెచ్‌పీ నాయకులు నివాళులు అర్పించారు. విదేశి సంస్కృతి మనకు వద్దన్నారు. ఫిబ్రవరి 14ను వీర జవాన్ల సంస్మరణ దినంగా జరుపుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed