'తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం'.. ఎమ్మెల్సీ కవితతో రైతు నేతలు భేటీ!

by Dishanational4 |
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం.. ఎమ్మెల్సీ కవితతో రైతు నేతలు భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితతో మంగళవారం హైదరాబాద్‌లో కర్ణాటక, తమిళనాడు, కేరళ రైతు సంఘాల నాయకులు భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు కేసీఆర్ రైతు పక్షపాతి అనడానికి నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందిచడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందన్నారు.

ఇతర రాష్ట్రాల రైతులు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారని, రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మార్పులు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంలో సమగ్ర మార్పు సాధ్యం అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి రైతు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతుతో పాటు గీత కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడుకు చెందిన రైతు సంఘం నేతలు అరి వకాగన్, సౌందర్య పాండియన్, మురిగేశం, బాల సుబ్రమణ్యం, కర్ణాటక నేతలు జీఎస్ రవీందర్, రవి ప్రకాష్, కేరళ నేతలు చంద్రన్, ధను శేఖర్ పాల్గొన్నారు.

Next Story