వేములవాడ దేవాలయం కోడెల విషయంలో తప్పుడు వార్తలు.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు

by Mahesh |
వేములవాడ దేవాలయం కోడెల విషయంలో తప్పుడు వార్తలు.. సైబర్ క్రైమ్ లో కేసు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ రాజన్న దేవాలయం కోడెల విషయంలో తప్పుడు వార్తలు ప్రచురితం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని దేవాదాయ శాఖ కార్యాలయం పీఆర్‌ఓ అజయ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలు ప్రచారం చేశారని వాటి వల్ల దేవదాయ శాఖకు , మంత్రిగా ఉన్న కొండా సురేఖ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలకు వినియోగించిన సోషల్ మీడియా సమాచారాన్ని, వాటి లింక్ ను ఫిర్యాదులో పోందుపరిచామని పిర్వో తెలిపారు. పిర్వో ఫిర్యాదు స్వీకరించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ పై తప్పుడు ప్రచారం చేసిన పై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed