- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైనూర్(Jainur) మండలం లో ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి జరిపి హత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆదివాసీ సంఘాలు(Tribal communities) వారం రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో రెండు ఆదివాసీలు మరో వర్గం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివాసులకు మద్దతుగా ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీష్ బాబు జైనూర్ వెళ్లనున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న జైనూర్ లో ఈ రోజు పరిస్థితులు ఉదృతంగా మారాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నెట్ వర్క్ ను సైతం తొలగించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జైనూర్ ఏజెన్సీలో దాదాపు 1000 మంది పోలీసులు సహారా కాస్తున్నట్లు తెలుస్తోంది.