గుడ్ న్యూస్: టీచర్ల ప్రమోషన్లు, బదిలీల అప్లికేషన్ల గడువు పొడిగింపు

by Disha Web |
గుడ్ న్యూస్: టీచర్ల ప్రమోషన్లు, బదిలీల అప్లికేషన్ల గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల ఆన్ లైన్ అప్లికేషన్ గడువును పొడిగించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఆన్ లైన్ దరఖాస్తులకు మూడ్రోజుల అవకాశాన్ని కల్పించారు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు చాన్స్ ఇచ్చారు. కాగా తాజాగా మరో రెండ్రోజులు అదనంగా పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తప్పుల సవరణ కూడా ఫిబ్రవరి 1వ తేదీలోపు వెరిఫై చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.Next Story