కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్.. CM KCR ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |
Telangana CM KCR Plans to establish National Media
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశమై సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. ప్రగతి భవన్ లో ఇవాళ కలిసిన నేతలతో ఆయన మాట్లాడారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో టెన్షన్ పడవద్దన్నారు. రాష్ట్రాన్ని పాలించేది బీఆర్ఎస్ అన్నారు. రెండు రోజుల తర్వాత సంబురాలు చేసుకుందామని నేతలతో తెలిపినట్లు తెలిసింది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈనెల 3న(ఆదివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

Advertisement

Next Story