మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ అభివృద్ధిపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆకునూరి మురళి ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారత్ అభివృద్ధిపై విమర్శలు చేశారు. భారతదేశం ఎదగడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అతిపెద్ద అడ్డంకుల్లో ‘కులం వైరస్’ ఒకటి అని పేర్కొన్నారు.

ప్రపంచం మొత్తం మీద భారతదేశానికే ఈ ప్రత్యేకమైన వైరస్ ఉందని, దీని కారణంగా ప్రపంచంలో భారతదేశం తన విశ్వసనీయతను కోల్పోతోందన్నారు. మురళి ట్వీట్‌పై నెటిజన్లు విభిన్న రకాల కామెంట్లు చేస్తున్నారు. మీ వ్యాఖ్యలను నిరూపించగలరా అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ‘అది కులం కాదు! కుల ఆధారిత రిజర్వేషన్లు భారతదేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి’ అంటూ మురళి స్టేట్మెంట్‌పై స్పందిస్తున్నారు. కాగా, సియాటెల్ వివక్ష వ్యతిరేక చట్టాల్లో ఇప్పుడు కుల వివక్షకూడా చేరింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని హిందువుల్లో కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని సియాటెల్ కౌన్సిల్ వెల్లడించింది.

Next Story