Etela Rajender : నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం: ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Etela Rajender : నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం: ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చితే సహించేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన బుధవారం ఆయన సరూర్‌నగర్‌ చెరువును స్థానికి బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం సామాన్యులకు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నోటీసులను ఆలయాలు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లకు కూడా అంటిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెదరాయుడు చెరువు మొత్తం విస్తీర్ణం 17 ఎకరాలని ఆ పక్కనే ఉన్న భూములను లేఅవుట్‌ చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమలు ఇచ్చిందని నేడే ఆ చెరువు విస్తీర్ణం 42 ఎకరాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని అన్నారు. నేడు అదే స్థలంలో నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను కూల్చేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.

Advertisement

Next Story