- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు

దిశ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని(State Secretariat) భారీ ఎత్తున నిర్శించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం అనంతరం దీనికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (Dr. BR Ambedkar Secretariat)గా నాటి ప్రభుత్వం పేరు పెట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఈ సచివాలయంలోకి మంత్రులు, అధికారులకు మినహా ఇతరులకు ఎంట్రీ ఉండకపోయేది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సామాన్యులకు సైతం సచివాలయంలోకి వచ్చే అవకాశం కల్పించారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం కల్పించిన ఈ అనుమతిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. గత కొద్ది రోజులగా.. నకిలీ ఉద్యోగులను (Fake employees) సచివాలయ భద్రతా సిబ్బంది (Secretariat Security Staff) పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నేడు.. తెలంగాణ సచివాలయంలో మరో నకిలీ ఉద్యోగి (Fake employee) పట్టుబడ్డారు. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహశీల్దార్ (Tehsildar) అని చెప్పుకొని ఈ రోజు సచివాలయం లోకి వెళ్లాడు. దీనికి ఆయన ఓ ఫేక్ ఐడీ కార్డును (Fake ID card) తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతనిపై అనుమానం రావడంతో అధికారులు విచారించి.. అతను ఫేక్ ఐడీ కార్డుతో వచ్చాడని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్న సచివాలయ భద్రతా సిబ్బంది.. సైఫాబాద్ పోలీసుల (Saifabad Police)కు అంజయ్యను అప్పగించారు. అయితే ఇటీవల కాలంలో రోజుకో నకిలీ ఉద్యోగిని భద్రత సిబ్బంది పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.